RRR: ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మెన్స్
Naatu Naatu from RRR Movie will be live Performed by Rahul Sipliganj and Kalabhairava
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి అరుదైన అవకాశం లభించింది. మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ 2023 స్టేజ్‌పై ఈ పాట పాడే అవకాశం కల్పించారు నిర్వాహకులు. సినిమాలో ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాటు నాటు సాంగ్ ఇప్పటికే అనేక సంచలనాలు నమోదు చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. 95వ అకాడమీ అవార్డులకు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. ఈ సినిమాకు అవార్డు వస్తుందా రాదా అనే విషయం మార్చి 12న తెలియనుంది.
రాహుల్ సిప్లిగంజ్ చాలా కాలంగా తెలుగు సినిమాలకు పాటలు పాడుతున్నాడు. అనేక హిట్ సినిమాల్లో పాటలు పాడాడు. కొంత కాలం క్రితం తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ షో లో పాల్గొన్నాడు. మరింత పాపులారిటీ సంపాదించాడు. తాజాగా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాడే అవకాశం రావడం రాహుల్ సిప్లిగంజ్ పేరు మరింత మార్మోగిపోనుంది.
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023
“Naatu Naatu” from “RRR” will be performed at the 95th Oscars® on March 12. “Naatu Naatu,” with music by M.M. Keeravaani & lyrics by Chandrabose, is nominated for Original Song. Singers Rahul Sipligunj & Kaala Bhairava will make their Oscars debut performing the song. #RRRMovie pic.twitter.com/spZFBxHD8E
— Janet R. Nepales (@jrnepales) February 28, 2023
This is going to be unforgettable moment in my life🔥🔥😎 https://t.co/Me1sCKSMxY
— Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023
Oscar-nominated song #NaatuNaatu from @ssrajamouli's @RRRMovie to be performed at @TheAcademy show. The song by M.M. Keeravaani & @boselyricist will be sung by Rahul Sipligunj & Kaala Bhairava in their #Oscars debut. Actors @AlwaysRamCharan & @tarak9999 are expected to attend. pic.twitter.com/xEHRNHCLck
— ruben nepales (@nepalesruben) February 28, 2023