బన్నీ- ధనుష్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే..?
చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటే ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఈ సినిమాను సాధ్యమయ్యేలా చేసిన ఘనత ఖచ్చితంగా రాజమౌళికే చెందుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరమీదకు వెళ్లనున్నాదట. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ , కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఒక సినిమా రాబోతుందని సమాచారం.
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది కూడా రాజమౌళి లా అపజయాన్ని ఎరుగని దర్శకుడు కొరటాల శివ అంట. ప్రస్తుతం కొరటాల ఆచార్య పూర్తి చేసి, ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ ని మొదలుపెట్టనున్నారట. ఇద్దరు స్టార్ హీరోలకు తగ్గ కథ అని, అందులో బన్నీ, ధనుష్ అయితేనే సెట్ అవుతారని కొరటాల అనుకున్నారట. ఇందుకోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే చిత్రపరిశ్రమలో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా నిలవబోతుంది అనడం ఖాయం..