OTT:ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న వెబ్‌సిరీస్, మూవీస్
OTT Releases This Week:ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీల్లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ గా ఉన్నాయి. ఇందులో కొన్ని ఈ మధ్యే రిలీజైన హిట్ మూవీస్ ఉండగా.. మరికొన్ని వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో ఓసారి చూద్దాం. సినిమా
ఎఫ్ 3: మే 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎఫ్3 మూవీ. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 22 శుక్రవారంన సోనీలివ్తోపాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో పాటు నవ్వుల పూలుపూయించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ది గ్రే మ్యాన్: మొదటిసారి తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్. ఇందులో కొంచం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో నటించాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది.ఏకంగా ఈ సినిమాను రైట్ బ్రదర్స్ ఇండియా కి వచ్చి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు.భారీ అంచనాల మధ్య ది గ్రే మ్యాన్ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇందులో ధనుష్‌తోపాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్లాంటి భారీ తారాగణం నటించారు.
పరంపర సీజన్ 2: డిస్నీ+హాట్‌స్టార్‌లో వచ్చిన పరంపర సీజన్1 వెబ్‌సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వచ్చేస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ , ట్రైలర్ ఈ సీజన్‌పై అంచనాలు పెంచేసింది. ఈ పరంపర సీజన్ 2 ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇండియన్ ప్రిడేటర్ : వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ డాక్యుమెంటెడ్ సిరీస్. అయేషా సూద్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇది ఓ సీరియల్ హంతకుడికి సంబంధించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.నెట్‌ఫ్లిక్స్ లో జులై 20 న విడుదలవుతుంది.
ఇక మరి కొన్ని వెబ్ సిరీస్ లు విడుదలకాబోతున్నాయి. ఘర్ వాప్సీ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్ లో జులై 22 న, రూహానియత్ చాప్టర్ 2 ఎంఎక్స్ ప్లేయర్ లో జులై 22 న విడుదలవుతున్నాయి.