Manchu Manoj: కాబోయే భార్యను పరిచయం చేసిన మంచు మనోజ్
Mohan babu is not attending Manchu Manoj Marriage
మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి గత కొన్ని రోజులుగా చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. . ఈ ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే గుప్పమన్నాయి. ఎట్టకేలకు వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయంలో మంచు మనోజ్ గానీ, మౌనికా రెడ్డి గానీ ఎటువంటి ప్రకటన స్వయంగా చేయలేదు. తాజాగా ఈ విషయాన్ని మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తనకు కాబోయే భార్యని పరిచయం చేశారు.
ట్విట్టర్ ద్వారా పెళ్లికూతురు అంటూ భూమా మౌనికా రెడ్డి ఫోటోని మంచు మనోజ్ షేర్ చేశాడు. పెళ్లికి ముస్తాబవున్న భూమా మౌనికారెడ్డి.. కూర్చొని ఉన్న ఫోటో ఒకటి ట్వీట్ చేశాడు. ఇందులో `పెళ్లికూతురు` అంటూ `మనోజ్ వెడ్స్ మౌనికా` అనే యాష్ ట్యాగ్‌ని షేర్ చేశాడు
రాత్రి 8.30 గంటలకు వివాహం
మంచు మనోజ్ వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 8:30 కి ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి స్వగృహంలో మంచు మనోజ్, మౌనిక రెడ్డిల వివాహం జరగనుంది. అతి కొద్ది మందిని మాత్రమే వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
2015లో పెళ్లి..2019లో విడాకులు
2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయారు. వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. రెండో పెళ్లి చేసుకోవాలని గత ఏడాది నిర్ణయించుకున్నాడు. వీరిద్దరూ కలిసి గతేడాది హైదరాబాద్ లో సీతాఫలండిలో ఒక వినాయక మండపానికి కూడా వెళ్లారు. ఇద్దరూ కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అప్పటి నుంచి మనోజ్, మౌనిక పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఖరారు చేస్తూ ఇప్పుడు ఇద్దరూ కలిసి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదా
మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. దీనికి అనేక కారణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. మౌనికారెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి. ఇప్పటికే మౌనిక మొదటి భర్త నుంచి విడాకుల తీసుకున్నారు. దీనికి తోడు మౌనికారెడ్డి ఫ్యామిలీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉంది. మోహన్ బాబు కుటుంబం సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితులు. అందుకే, ప్రత్యర్థి పార్టీ నేత కుమార్తె కావడం వల్ల మౌనికారెడ్డితో మనోజ్ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అసలు మనోజ్ పెళ్లికి మోహన్ బాబు హాజరుకావడం లేదని సమాచారం వస్తుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న మనోజ్ పై మోహన్ బాబు చాలా కోపంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని అంటున్నారు. ఈరోజు పెళ్లికి కూడా ఆయన హాజరుకాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
Manchu