MM Srilekha:69వ జాతీయ పురస్కారాల్లో మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సినిమా సత్తా చాటింది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం నుంచి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 పురస్కారాలని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
MM Srilekha:69వ జాతీయ పురస్కారాల్లో మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సినిమా సత్తా చాటింది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం నుంచి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 పురస్కారాలని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. గత కొంల కాలంగా జాతీయ అవార్డుల విషయంలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఎక్కువగా బాలీవుడ్ వల్లే అవార్డుల్ని ఎగరేసుకుపోతున్నారని, ఈ విషయంలో దక్షిణాది వారిని చిన్న చూపు చూస్తున్నారనే విమర్శలు ప్రధానంగా వినిపించాయి.
అయితే జాతాగా ప్రకటించిన అవార్డుల్లో మాత్రం ఎక్కడా ఈ ఆ వివక్ష కనిపించకపోవడంతో అంతా అవాక్కవుతున్నారు. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వివిధ విభాగాల్లో ఏకంగా 11 అవార్డులు దక్కడమే ఇందుకు కారణం. ఇక జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డుని ప్రవేశ పెట్టి ఏడు దశాబ్దాలు అవుతున్నా ఒక్కరంటే ఒక్క తెలుగు నటుడు కూడా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని దక్కించుకోలేకపోయారు. ఇది ప్రతి తెలుగు ప్రేక్షకుడిని కొన్నేళ్లుగా వెంటాడుతోంది.
ఆ లోటుని భర్తీ చేస్తూ తెలుగు వెండితెరపై నీరాజనాలందుకుని డెమీ గాడ్స్‌గా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన హేమా హేమీలు ఎన్టీఆర్, ఏ ఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి తారలకు సాధ్యం కానీ ఫీట్‌ని సుసాధ్యం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 69వ జాతీయ పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటుడిగా `పుష్ప` సినిమాకు గానూ అవార్డుని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 70 ఏళ్ల సినీఆ చరిత్రలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు హీరోగా రికార్డు సాధించారు. జాతీయ అవార్డుల సమయం వచ్చిన ప్రతి సారి ఉత్తరాది వారిదే ఆధిపత్యం కనిపించేది.
కానీ ఇప్పుడు మాత్రం దక్షిణాది ఆదిపత్యం కనిపించింది. దీనికి కారణం ఏంటీ? అంతా టాలీవుడ్ వాణిని బలంగా వినిపించింది ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది మరెవరో కాదు సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ. యస్‌మీరు విన్నది నిజమే. టాలీవుడ్ నుంచి జాతీయ అవార్డుల జ్యూరీ కమిటీలో సభ్యురాలిగా ఎంపికైన శ్రీలేఖ ఈ సారి మన టాలీవుడ్ వాణీని బలంగా వినిపించారట. ఇదే విషయాన్ని ఆమె అవార్డుల ప్రకటన అనంతరం వెల్లడించారు. తెలుగు సినిమాలంటే నిర్లక్ష్యం. కంటితుడుపు చర్యలు కనిపించేవి. ఒకటో రెండు అవార్డులు కంటితుడుపుగా ప్రకటించేవారు. దీనిపనై జ్యూరీలో గట్టిగా మాట్లాడే వారు కావాలి. అదే సమయంలో ఆ సినిమాలో విషయం ఉండాలి` అని తెలిపారు.