Keeravani: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న కీరవాణి బృందం
MM Keeravani Participates In Green India Challenge: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు నిరాటకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన కీరవాణి ఈ ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఆయనతో పాటు ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు, అరుణ్ కౌండిన్య, అమలా చేబోలు, మహమ్మద్ హైమత్ మరియు గోమతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ పాట రూపంలో మొక్కల ప్రాధాన్యతను తెలిపారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ “మనం మనుషులతోనే మాట్లాడతాం, మనుషుల్నే జీవులుగా పరిగణిస్తాం. కానీ మొక్కలు మనకన్న గొప్పవి. ఏ స్వార్థం లేకుండా మన బ్రతకడానికి కావల్సిన ఆక్సీజన్‌ను అందిస్తాయి. మనం బ్రతకాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలని” తెలిపారు. అనంతరం సంగీత దర్శకులు మణి శర్మ, సునీత ఉపద్రష్ట, వందేమాతరం శ్రీనివాస్ లను నామినేట్ చేశారు.