అల్లు అర్జున్ కి స్పెషల్ విషెస్ తెలిపిన మెగాస్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 40 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. ఇక నేడు బన్నీ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు ప్రముఖులు కూడా బన్నీకి బర్త్ విషెస్ తెలుపుతున్నారు. ఇక అల్లువారి అబ్బాయికి మేనమామ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు.