‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ప్రమోషన్లో భాగంగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరు మెగా ఎంట్రీ అదిరిపోయింది. బ్లాక్ షర్ట్ లో చిరు అదరగొట్టేశారు. ఇక చిరు కన్నా ముందే రాజమౌళి తో పాటు ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ తండ్రి కొడుకుల ఎంట్రీ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారింది.
The one and only MEGASTAR is here ♥️
Our 'Acharya' @KChiruTweets Royal Entry at the #AcharyaPreReleaseEvent
Watch Live Now!
– https://t.co/Ff0hE36FSR#Acharya #Siddha#AcharyaOnApr29 pic.twitter.com/Xgx1O2hv8V— Konidela Pro Company (@KonidelaPro) April 23, 2022