Megastar Chiranjeevi: అల్లు అరవింద్ తో విభేదాలపై పెదవి విప్పిన చిరంజీవి
Megastar Chiranjeevi on Allu Aravind: మెగాస్టార్ చిరంజీవి అలాగే అల్లు అరవింద్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటికే అటు అల్లు అరవింద్ ఇటు మెగాస్టార్ కానీ అనేక సందర్భాలలో క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో ఈ విషయం మీద మరోసారి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి తరహా వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయని పేర్కొన్న ఆయన అసలు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. కుటుంబ పరంగా మేము ఎప్పుడూ కలిసే ఉన్నామని పేర్కొన్న ఆయన అల్లు అరవింద్ పుట్టినరోజు కానీ ఏదైనా పండుగ వస్తే అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ మధ్య జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా నేను పాల్గొనలేక పోయినప్పటికీ మా కుటుంబంలోని అందరూ ఒకచోట చేరి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని, అల్లు అర్జున్ కూడా మా ఇంటికి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేశాడని, మిగతా హీరోలు వరుణ్ తేజ్ అలాగే మా అమ్మాయిలు, ధరమ్ తేజ్ వంటి వారు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు.