Pakka Commercial: గోపీచంద్ కి సపోర్ట్ గా మెగాస్టార్
Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.అందులో భాగంగా త్వరలోనే `పక్కా కమర్షియల్` మూవీతో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.గోపీచంద్ సీటీమార్ యావరేజ్ గా ఆడింది. అందుకే సరైన బ్లాక్ బస్టర్ తో అతడు కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు.
యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్ల పై ఈ మూవీని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరింత హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా నుండి కేరేజి అప్ డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి మెగాస్టార్ సపోర్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న జరగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా వస్తున్నాడు.ఇదిలా ఉంటే దర్శకుడు మారుతి కూడా ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. తదుపరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి హిట్టు కొడితే ప్రభాస్ సినిమా పై హైప్ క్రేయేట్ అవుతుంది. ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.