Allu Studio: అంగరంగ వైభవంగా ప్రారంభమైన అల్లు స్టుడియో
అల్లు కుటుంబం కలల ప్రాజెక్టు సాకారం అయింది. అల్లు రామలింగయ్య పేరుతో నిర్మించిన స్టుడియో ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా అల్లు స్టుడియో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో నిర్మాత అల్లు అరవింద్‌కి చెందిన స్థలంలో ఈ స్టుడియో నిర్మాణం జరిగింది. రెండేళ్ల క్రితం స్టుడియో నిర్మాణం ప్రారంభం అయింది. అక్టోబర్ 1, 2022నాటికి అల్లు రామలింగయ్య జన్మించి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్టుడియో ప్రారంభోత్స కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ అల్లు స్టుడియోలో ప్రారంభం కానుంది. అల్లు స్టుడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 చరిత్రలో నిలిచిపోనుంది.
Megastar @KChiruTweets garu Speaking LIVE at @AlluStudios Launch!
LIVE ▶️ https://t.co/Qi2BOU0apz #AlluRG100 ✨ #AlluRamalingaiah #AlluAravind @alluarjun @AlluSirish @Bobbyallu pic.twitter.com/XHdLJDW5zK
— Allu Studios (@AlluStudios) October 1, 2022
Stay tuned ▶️ https://t.co/Qi2BOU0apz #AlluRamalingaiah #MegastarChiranjeevi #AlluRG100 ✨ pic.twitter.com/LUXIXaTJuE
— Allu Studios (@AlluStudios) October 1, 2022
1000 సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య
అల్లు రామలింగయ్య తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1000 సినిమాల్లో నటించారు. హాస్యప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రావు గోపాల రావు కాంబినేషన్‌లో అల్లు రామలింగయ్య చేసిన అనేక పాత్రలు తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1950లో తొలి సినిమా పుట్టిల్లుతో ప్రారంభమైన అల్లురామలింగయ్య సినీ ప్రయాణం 2004లో జై అనే సినిమా వరకు కొనసాగింది.
అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవికి తన కుమార్తె సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు. తన అల్లుడిగా చేసుకున్నారు. తనయుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఎదగడంలో ఎంతగానో సహకరించారు. మనవడు అల్లు అర్జున్ తొలి సినిమా విడుదల అయ్యే సమయానికి (మే 7, 2004) బ్రతికే ఉన్నారు. జూలై 31, 2004న ఈ లోకాన్ని విడిచిపోయారు.
అల్లు రామలింగయ్య తన సుదీర్థ కెరీర్‌లో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1990లో పద్మశ్రీ అవార్డు, 1998లో ఫిల్మ్ ఫేర్ లైఫ్‌టైమ్ అచీమ్‌మెంట్ అవార్డు, 2001లో రఘపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.