Maruthi: అక్టోబర్‌లో మారుతి,ప్రభాస్ సినిమా మొదలు ?
Maruthi And Prabhas: ‘పక్కా కమర్షియల్’ సినిమా ఫెయిల్యూర్ తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమాని పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ మాత్రం మారుతి దర్శకత్వంలో సినిమా చేసే విషయమై ముందుకే వెళ్ళాలనుకుంటున్నాడట. ప్రభాస్ తో సినిమా చేసి మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు మారుతి.
ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా వున్నాడు.ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇదొక విజువల్ వండర్ అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటిస్తుంది.అలాగే ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్,సందీప్ రెడ్డి వంగా డైరక్షన్లో ‘స్పిరిట్’ అనే మరో సినిమా లో నటిస్తున్నాడు.
మారుతి సినిమా త్వరలో నే సెట్స్ మీదకు వెళ్ళబోతోందట. ప్రభాస్ కోసం ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌ని మారుతి ప్రిపేర్ చేశాడనీ టాక్ నడుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, అక్టోబర్‌లోనే మారుతి – ప్రభాస్ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది.ఈ సినిమా కోసం మాళవిక మోహనన్ని హీరోయిన్గా ఖరారు చేసారని సమాచారం. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభమైన ‘హీరో’ సినిమాలో మాళవిక మోహనన్ ఎపికైంది మధ్యలోనే ఆ సినిమా ఇతర కారణాలవల్ల ఆగిపోయింది.ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించబోతుంది.