Manchu Manoj: రేపే మంచు మనోజ్ పెళ్లి ప్రకటన!
Manchu Manoj Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న అంశం మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి వివాహం. కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ గణేష్ మండపాలను సందర్శించడం ఒక్కసారిగా వీరి పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చేలా చేసింది. ఇక తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఇచ్చిన వైరల్ గా మారింది. తన జీవితంలో నెక్స్ట్ పేజీలోకి అడుగు పెట్టబోతున్నానన్నారు. చాలా రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న స్పెషల్ న్యూస్ ను ఈనెల 20వ తేదీన అందరితో పంచుకోబోతున్నానంటూ ఆయన ట్వీట్ లో తెలిపారు. మనోజ్ భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు 20వ తేదీన మనోజ్ ప్రకటించబోతున్నారని అందరూ దాదాపుగా ఫిక్స్ అయ్యారు.
ఇటీవల కడప దర్గా వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించడంతో మనోజ్-మౌనిక రెడ్డి వివాహం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అయన రేపు ఉదయం తొమ్మిది గంటల 45 నిముషాలకు ఈ అప్డేట్ ఇస్తారని అనౌన్స్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మనోజ్ ఇచ్చిన అప్డేట్ వైరలైంది. ఇక సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ఇటీవల అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించి అభిమానులను కలవబోతున్నానంటూ గతంలో ప్రకటించారు.