Manchu Manoj: కర్నూల్కు మంచు మనోజ్ దంపతులు
Manchu Manoj: దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మంచు మనోజ్. మంచు మనోజ్, భూమా నాగ మౌనికా రెడ్డిలకు ఇద్దరికీ ఇది రెండో వివాహం. మార్చి 3వ తేదీన పెళ్లి చేసుకున్న ఈ జోడీ.. మరో మూడు రోజుల్లోనే హనీమూన్ ట్రిప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో మనోజ్-మౌనికరెడ్డి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. కాగా కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ దంపతులు భారీ కాన్వాయ్ తో కర్నూల్ బయలు దేరివెళ్లారు.
ప్రొద్దుటూరులో రామ సుబ్బారెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ లోని భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో మొదటిసారి వివాహమైంది. వీరిద్దరూ 2019లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. వీరికి ఓ కొడుకుకూడా ఉన్నాడు. తాజాగా వివాహ బందంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ కొత్త జంట హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుందనే విషయం బయటకొచ్చింది.