Mohanlal in Jailer Movie: రజనీ కాంత్ సినిమాలో మోహన్ లాల్
Malayalam Super Star Mohan Lal in Rajani Kanth’s Movie
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకే సినిమాలో కనిపించనున్నారు. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
రజనీకాంత్, మోహన్ లాల్‌లు దాదాపుగా నాలుగు దశాబ్ధాలుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఒకరు తమిళంలో సూపర్ స్టార్‌గా ఎదగగా..మరొకరు మలయాళంలో సూపర్ స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి నటించలేదు. అటువంటి అవకాశం వారికి కలగలేదు. ప్రస్తుతం ఆ అవకాశం దక్కింది. జైలర్ సినిమాలో మోహన్‌లాల్ ఓ పాత్ర చేస్తున్నాడని తెలియడంతో ఇద్దరి స్టార్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 8, జనవరి 9వ తేదీల్లో మోహన్ లాల్ పాత్ర చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. జైలర్ సినిమాలో పవన్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. సినిమాలో చాలా భాగం జైల్లోనే చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ సినిమాను కళానిధి మారన్‌కి చెందిన సన్ ఫిల్మ్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నాడు. శివ రాజ్‌కుమార్‌కు ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం. జైలర్ సినిమాలో త్రిష, రమ్యకృష్ణ, యోగిబాబు, వినాయకన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జైలర్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో రజనీకాంత్ సినిమాలు పెట్టా, దర్బార్ సినిమాలకు కూడా అనిరుధ్ సంగీతం అందించాడు. రజనీతో అనిరుధ్ చేస్తున్న మూడవ సినిమా జైలర్ కావడం విశేషం.