Maheshbabu: జనవరిలో సెట్స్ పైకి మహేష్-త్రివిక్రమ్ మూవీ
Mahesh babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కొద్దీ రోజుల క్రితం ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లగా..ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీ లో కృష్ణ మరణం చోటుచేసుకోవడం , హీరోయిన్ పూజా హగ్దే కాలికి గాయం కావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు మహేష్. ఇప్పుడిప్పుడే తండ్రి మరణం నుండి కోలుకుంటున్న మహేష్ ప్రస్తుతం అంత సెట్ కావడం తో త్రివిక్రమ్ కాంబో సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెలిపింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబో లో మూవీ వస్తుండడం తో సినిమా ఫై అంచనాలు తారాస్థాయి కి చేరాయి.