Mahesh babu:రాజమౌళి కి కండిషన్ పెట్టిన మహేష్ ?
Maheshbabu New Condition Rajamouli:రాజమౌళి ఈ మద్యే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్క్కిన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది.ఏకంగా వేయి కోట్ల మార్కును దాటేసింది.ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.
“బాహుబలి 2”, ‘ఆర్ ఆర్ ఆర్’ రెండు సినిమాలతో తిరుగులేని క్రేజ్ దేశంలో ప్రపంచంలో సాధించిన రాజామౌళి రాజమౌళి మహేష్ సినిమా ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు . ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుందని టాక్. విజయేంద్ర ప్రసాద్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న రాజమౌళికి తాజాగా.. మహేష్ బాబు కొత్త కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
హీరోయిన్ విషయంలో రాజమౌళి కి కొత్త కండిషన్ పెట్టాడంట ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకోవద్దని.. మహేష్ కొత్త షరతు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు మహేష్ నటించిన సినిమాలలో చాలా వరకు హిందీ హీరోయిన్లతో నటించాడు. దీంతో వాళ్లతో.. విసిగిపోయే సందర్భాలు.. మహేష్ కు ఉన్నాయట అందుకే ముందు జాగ్రత్తగా.. రాజమౌళికి సూచించినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. రెండేళ్ళ కిందట విడుదలైన సరిలేరు నీకెవరులో రష్మిక నటిస్తే ఈ మద్యే విడుదలైన సర్కారువారి పాట చిత్రంలో కీర్తి సురేష్ నటించింది.ఇక మహేష్ తో జత కట్టే హీరోయిన్ ఎవరో అని అందరు వెయిట్ చేస్తున్నారు.మరోపక్క ఈ కండిషన్ కి రాజమౌళి ఒప్పుకున్నాడా?లేదా అని తెలియాలి.