Mahesh Babu : కూతురి డ్యాన్స్ చూసి ఫిదా అయిన ప్రిన్స్
Mahesh Babu: మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అప్ డేట్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన తండ్రి మహేష్ సినిమాలోని పాటలకు తనదైన స్టెప్పులు వేసి మహేష్ అభిమానులకు కి ట్రీట్ ఇస్తుంటుంది. సర్కారు వారి పాట సినిమా ద్వారా థమన్ తో స్టెప్పులేసి అదరగొట్టింది సితార.. ఎప్పటికపుడు మహేష్ అభిమానులకే సర్ప్రైజ్ ఇస్తుంటుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా వచ్చిన సినిమా ‘అతడు’. ఈ సినిమాలో ‘పిల్లగాలి అనే పాటకు త్రిష వేసిన స్టెప్పులను ఎవరూ మర్చిపోలేరు. ఇదే పాటకు తాజాగా మహేష్ బాబు కూతురు సితార స్టెప్స్ వేసి అలరించింది. సితార క్యూట్ డ్యాన్స్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. సితార హావభావాలకు మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు.