Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ ధమ్కీ
Nithiin Macherla Dhamki : నితిన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ‘మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కేథరిన్ – కృతి శెట్టి హీరోయిన్లుగా అలరించనున్నారు. నటిస్తున్న ఈ లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. భారీ మాస్ ఎలిమెంట్స్ తో సినిమాను విడుదల చేయనున్నారు.
ఇందులో నితిన్ కలెక్టర్గా కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి ముందే చిన్న మాస్ ట్రీట్ అన్నట్టు మాచర్ల యాక్షన్ ధమ్కీ అంటూ చిన్న వీడియోను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమానుండి విడుదలైన పోస్టర్స్ ,సాంగ్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో అంజలి స్పెషల్ సాంగ్ రా రెడ్డి మాత్రం మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.
ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాదిమంది తమ సమాధులను పునాదులుగా వేశారు .. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధమని డైలాగ్ తో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.