Like Share & Subscribe సంతోష్ శోభన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీని ప్రేక్షకులు లైక్ చేసారా లేదా చూద్దాం.
విప్లవ్(సంతోష్ శోభన్) విహారి అనే యూట్యూబ్‌ని రన్ చేస్తున్న ట్రావెల్ వ్లోగర్. యూట్యూబ్‌లో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న వసుధ(ఫరియా అబ్దుల్లా)ని స్ఫూర్తిగా తీసుకుని తన యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తుంటాడు. ఆమెలా తను కూడా ఎదగాలనుకుంటాడు. వసుధ డీజీపి కూతురు. వసుధలా మిలియన్స్ ఫాలోవర్స్, వ్యూస్ రావాలంటే అరకు ట్రావెలింగ్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేయాలని నిర్ణయించుకుంటాడు విప్లవ్. ఫారెస్ట్ లో తన గురించి చెబుతున్న క్రమంలో పడిపోతున్న విప్లన్‌ని కాపాడే సీన్‌తో వీరిద్దరు కలుసుకుంటారు. ఇంతలో పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ దళాలను చెందిన ముగ్గురు నాయకులను శాంతి చర్చలకు పిలిచి చంపేసిన పోలీసులపై ప్రతీకారం తీసుకోవాలనుకుంటుంది పీపీఎఫ్ దళం. అందుకు డీజీపీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. అరకులో డీజీపీ కూతురు ఉందని తెలిసి ఆమెని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతకీ కిడ్నాప్ జరిగిందా? వీరిద్దరి ప్రేమ చివరకి ఎలాంటి మలుపు తిరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే
సంతోష్ శోభన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మరియు కొన్ని సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా సంతోష్ శోభన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.. ఫరియా అబ్దుల్లా తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. సుదర్శన్, బ్రహ్మాజీ అండ్ టీం అలాగే మిగిలిన ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు.
ఎంటర్టైన్ గా సాగినా ఈ చిత్రం అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. ఎమోషనల్‌గా ఈ సినిమా ఏ విధంగానూ కనెక్ట్ అయ్యేలా లేదు. ఇక మ్యూజిక్ పరంగా బాగుంది. కానీ ఫోక్ సాంగ్‌ని రొమాంటిక్‌గా తీయడమే ఆడియెన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మేర్లపాక గాంధీ కథ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. చివరగా చిత్రాన్ని లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ చేయకుండానే వెళ్లిపోతున్నారు.