Vijay Devarakonda: డాన్స్ చేయలేక ఇబ్బంది పడ్డాను విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Cried for Akdi Pakdi Song: విజయ్ దేవరకొండ, అనన్యా పాండే కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ నుంచి అకిడి పకిడి సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘లైగర్’. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది.
ఇందులో విజయ్ కిక్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. తొలిసారి ఇండియన్ తెర పై బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కనిపిస్తున్న సినిమాగా కూడా ‘లైగర్’ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.ఈ అకిడి పకిడి అనే సాంగ్ తెలుగుతో పాటు హిందీ , తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పాట వచ్చింది. హిందీలో ఈ సాంగ్ ఇప్పటికే కోటికిపైగా వ్యూస్ సొంతం చేసుకోగా.. తెలుగులో 35 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.ఈ సందర్బంగా విజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసాడు.
“కొరియోగ్రఫీ చూసి నేను ఏడ్చినంత పని చేశాను. కానీ ఈ సాంగ్ షూటింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను” అని విజయ్ ట్వీట్ చేశాడు. ఆ పాట యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు.
I almost cried when I saw the choreography.
But had a Blast shooting this ❤️#AKDIPAKDIhttps://t.co/v6PggR0QHV#LIGER#LigerOnAug25th pic.twitter.com/nWAAoareqv
— Vijay Deverakonda (@TheDeverakonda) July 12, 2022