Liger: జూలై 21న ‘లైగర్’ థియేట్రికల్ ట్రైలర్
Liger Trailer Releasing on 21st July : విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ఇండియా ప్రాజెక్టు లైగర్. ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అనన్య పాండే హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే అక్డీ పక్డీ అనే సాంగ్ విడుదలై అభిమానులను అలరిస్తుంది.
తాజాగా లైగర్ టీమ్ మరో అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. జూలై 21న అన్ని భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. తనను చుట్టుముట్టిన ఫైటర్స్‌తో విజయ్ దేవరకొండ పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలై దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. 30 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.అలాగే ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ నటిస్తుండడం విశేషం.
పూరీ కనెక్ట్స్‌తో పాటు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.విజయ్ దేవరకొండ ఇందులో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ ఫైటర్‌గా కనిపించనున్నాడు.