Liger: ప్రమోషన్ల జోరు పెంచిన విజయదేవరకొండ
లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల జోరు పెంచాడు విజయదేవర కొండ. ఇందులో భాగంగానే ఇటీవలే కరణ్ జోహార్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. కరణ్ అడిగిన అనేక చిక్కు ప్రశ్నలకు వీరిద్దరూ ఆసక్తికలిగించే సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ ముంబై లోకల్ ట్రైన్లో చక్కర్లు కొట్టారు. ప్రమోషన్లో భాగంగా చేసిన ఈ మెట్రోజర్నీలో విజయదేవరకొండ అనన్య పాండే ఒళ్లో పడుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం తెగ సర్కులేట్ అవుతోంది.
@ananyapandayy and @TheDeverakonda takes Mumbai Metro ride.#ananya #ananyapanday #ananyapandey #vijaydevarakonda #vijay #bollywood #bollywoodactor #chipkumedia pic.twitter.com/LwWkp7ltis
— Chipku Media (@ChipkuMedia) July 29, 2022
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. కరణ్ జోహార్, చార్మీతో కలిసి పూరి జగన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
India!
Presenting, The Liger attitude –Podham. Kotladudham.
Sabki #WaatLagaDenge 🤙– https://t.co/WNZJw6dnS4#LIGER #LigerOnAug25th pic.twitter.com/hz9yWRYpob
— Vijay Deverakonda (@TheDeverakonda) July 29, 2022
లైగర్ నుంచి మ్యూజిక్ వీడియో
లైగర్ చిత్ర బృందం ఆ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. లైగర్ సినిమా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉండబోతోందో వివరించే ఈ పాటను పూర్తి జగన్ స్వయంగా రాశారు. సునీల్ కశ్యప్ స్పరపరిచాడు. హీరో విజయ్ దేవరకొండ ఆలపించాడు. ఈ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్లో దూసుకుపోతోంది.