Liger: భారీ ధరను సొంతం చేసుకున్న ‘లైగర్’ డిజిటల్ రైట్స్
Vijay Deverkonda’s Liger Sold To Digital Platform : విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకొని మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి, శాటిలైట్ రైట్స్ భారీ ధరకి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం లైగర్ సినిమా శాటిలైట్ రైట్స్ ని రూ 98 కోట్లకు కైవసం చేసుకుందని సమచారం. అందువల్ల థియేటరికల్ రైట్స్ కి కూడా భారీ ధరపలికిందని సమాచారం. 160 కోట్లు భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ.98 కోట్లు వసూలు చేసింది. దీంతో బడ్జెట్ లో మాగ్జిమమ్ రికవరీ అయినట్టు తెలుస్తోంది.
భారీ స్థాయిలో సాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. వరుస ప్లాఫ్ లలో ఉన్న విజయ్ లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకులను పక్కా ఎంటర్టైన్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించాడు.విజయ్ సరసన అనన్య పాండే నటించింది ఇక వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.