బుల్లెట్ ఎక్కి వచ్చేస్తా అంటున్న వారియర్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ది వారియర్”. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
ఇక ఈ సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడడం విశేషం.. బుల్లెట్ బండి ఎక్కి అంటూ సాగే ఈ పాటను తెలుగు, తమిళ్ భాషల్లో కూడా శింబునే పాడినట్లు మేకర్స్ తెలిపారు. అందుకు సంబంధించిన స్నీక్ పీక్ ను చిత్ర బృందం షేర్ చేసింది. ఇక ఈ సాంగ్ ప్రోమోలో బుల్లెట్ బండిపై రామ్ ఎంతో స్టైలిష్ గా ఉండగా.. మోడ్రన్ లుక్ లో కృతి శెట్టి అదరగొట్టేసింది. డీఎస్పీ స్వరపరిచిన ఈ పుల్ సాంగ్ ఏప్రిల్ 22 న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.