ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటున్న టాలీవుడ్ హీరోయిన్
‘ఆకతాయి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రుక్సార్ థిల్లాన్. ఈ సినిమా తర్వాత నాని సరసన కృష్ణార్జున యుద్ధం, అల్లు శిరీష్ సరసన ABCD లో నటించి మెప్పించిన ఈ ముద్దగుమ్మ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన నటిస్తోంది. విద్యాసాగర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రుక్సార్ మాట్లాడుతూ తన పెళ్లి విషయం గురించి చెప్పుకొచ్చింది. “మా ఇంట్లో దాదాపు అందరూ ప్రేమ వివాహాలే చేసుకున్నారు. నేను కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయి కావాలి. అలాంటి అబ్బాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని తెలిపింది.