‘లైగర్’ బ్యూటీ బికినీ ట్రీట్.. కుర్రాళ్లకు నిద్ర కరువే ఇక
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే అనన్య టాలీవుడ్ కుర్రకారుకు సుపరిచితమే. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించే అమ్మడు తాజాగా మరోసారి బికినీ ట్రీట్ ఇచ్చింది. గెహ్రైయాన్ షూటింగ్ డేస్ నుండి త్రోబాక్ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
`కంటిన్యూటీ ఫోటోలు అంత బ్యాడ్ కానప్పుడు ???? త్రోబాక్ టు గెహ్రైయాన్ డేస్..!!`అంటూ చెప్పుకొచ్చింది. నీలిరంగు ప్రింటెడ్ డిజైన్ బికినీతో అమ్మడు సెగలు రేపుతోంది. వయ్యారంగా నిలబడి అందాలను ఎలివేట్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు.. అనన్య అందాలకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ కి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. అనన్య టూ హాట్ గా కనిపిస్తోందంటూ కామెంట్లతో వెబ్ ని హీటెక్కిస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ లైగర్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ హిట్ ని అందుకుంటుందా..? లేదా అనేది చూడాలి.