రియల్ హీరోనే మర్చిపోయారా..? లేక వదిలేశారా..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరన కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ వేదికపై చిరు, చరణ్, పూజ హెగ్డే, కొరటాల శివ తప్ప ఎవరు కనిపించలేదు. ముందు నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా చెప్పుకున్న కాజల్ గురించి ఒక్కరు మాట్లాడలేదు. అయితే కాజల్ గర్భవతి కావడం వలన ఆమె షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయింది, అందుకే ఆమెను పక్కన పెట్టారు అని రూమర్స్ వస్తున్నాయి.. సరే ఆ విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో రియల్ హీరో సోనూసూద్ విలన్ గా నటించారు.
కరోనా సమయంలో పేదవారికి అడిగింది లేదనకుండా ఇచ్చిన సోనూ చాలా గ్యాప్ తరువాత ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనూసూద్ ది చాలా పవర్ ఫుల్ రోల్ అని ట్రైలర్ చూస్తుంటూనే అర్దమవుతుంది. మరి అలాంటి పాత్ర గురించి కానీ, సోనూ గురించి కానీ చిత్ర బృందం లో ఒక్కరు కూడా మాట్లాడకపోవడం విశేషం.. ప్రతి ఒక్కరు చిరు, చరణ్ ల తో పాటు కొద్దిసేపు కనిపించిన పూజా గురించి కూడా మాట్లాడారు కానీ మెయిన్ విలన్ గా నటించిన సోనూసూద్ గురించి మాట్లాడకపోయేసరికి ఆయన అభిమానులు హార్ట్ అవుతున్నారు. ఆచార్య టీమ్ సోనూను మర్చిపోయిందా.. ? లేక కావాలనే వదిలేసిందా.. ? అనేది తెలియాలి