యష్ తదుపరి సినిమా అదేనా..?
ప్రస్తుతం ఎక్కడ విన్నా రాకింగ్ స్టార్ యష్ గురించే చర్చ .. కెజిఎఫ్ రెండు పార్ట్ లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమా విడుదలై రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాతో యష్ రేంజ్ పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే యష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు అని.. ప్రస్తుతం హీరోలు చేతిలో నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టుకొని బిజీగా మారుతున్నారు.
సినిమా రిలీజ్ అయినా కూడా యష్ తన తదుపరి సినిమాను ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్టార్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ కి సంతకం కూడా చేయలేదు. అసలు ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే హింట్ కూడా లేదు. దీంతో యష్ ఏమైనా కొత్త ప్లాన్ వేస్తున్నాడా..? అసలు అతగాడి ఎత్తుగడ ఏమిటి అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం తన తదుపరి సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగానే ప్లాన్ చేస్తున్నాడట.. మరి ఇందులో నిజం ఎంత అని తెలియాలంటే రాకింగ్ స్టార్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.