‘కెజిఎఫ్’ ఎఫెక్ట్.. పారితోషికం పెంచేసిన డైరెక్టర్
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటున్న ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ చేస్తుండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నదని సమాచారం.కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ తన రెమ్యూనిరేషన్ డబుల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కెజిఎఫ్’ రెండు భాగాలకు గాను ప్రశాంత్ నీల్ ఏకంగా రూ. 50కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడని టాక్.
అలాగే.. ‘కేజీఎఫ్ 2’ చిత్రానికి పారితోషికంతో పాటు లాభాల్లో వాటాని కూడా అందుకోనున్నాడని సమాచారం. అయితే తదుపరిగా అతడు చేయబోయే తెలుగు సినిమాల విషయంలో నిర్మాతలు అతడికి కేవలం రూ. 50 కోట్ల పారితోషికం మాత్రమే అందిస్తారని తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ తన పారితోషికాన్ని పెంచే పనిలో ఉన్నాడట. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ సౌత్ సినిమాలను ఒక రేంజ్ లో నిలబెట్టిన ఈ డైరెక్టర్ కు అది తక్కువ పారితోషికమే.. అందుకు డబుల్ ఇచ్చినా తక్కువేం కాదు అని అభిమానులు అంటున్నారు. మరి తెలుగు నిర్మాతలు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ అడిగినట్లు డబుల్ రెమ్యూనిరేషన్ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.