K V Mahadevan స్వరబ్రహ్మ కె. వి.మహదేవన్
K V Mahadevan:సినిమా పాట మొదట ప్రజలను ఆకర్షించాలంటే….అందరూ పాడుకునేందుకు వీలుగా ఉండాలి. అలాఉన్న పాట ఈజీగా జనాల్లోకి వెళ్తుందని కె.వి.మహదేవన్ అంటాడు.శాస్త్రీయ సంగీతం క్షుణ్ణం గా వచ్చినా కూడా జానపదాల శైలి కలబోసి…అద్భుతమైన బాణీలను అందిస్తాడు.
మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్. 1917లో మార్చ్ 14న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కి చెందిన తమిళ అయ్యర్ల కుటుంబంలో జన్మించారాయన. తండ్రి వెంకటాచలం భాగవతార్ గోటు వాద్యంలో నిపుణుడు. తాతగారు కూడా సంగీత విద్వాంసులే. దాంతో చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది.
మహదేవన్ ది తమిళమే అయినా తెలుగు సినిమాకి ఆయన స్వరపరచిన బాణీలు అజరామరం అని చెప్పాలి. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించాడు . అదే సంవత్సరంలో విడుదలైన ‘ముందడుగు’ సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. 1962 లో విడుదలైన ‘మంచి మనసులు’ కేవలం పాటల వల్లే సినిమాలు హిట్ అవుతాయని నిరూపించాడు మహదేవన్ . అందుకు సాక్షం ‘మావా…మావా’ పాట బాగా జనాదరణ పొందింది.
అప్పటి నుంచి మహాదేవన్ ను ఇండస్టీలో “మామ” అని పిలవడం మొదలుపెట్టారు. 1963లో వచ్చిన “మూగ మనసులు” మహదేవన్ ను తిరుగులేని స్థానానికి చేర్చాయి.ఇక పోటీ ఎక్కడైనా ఉంటుంది. ఎం.ఎస్.విశ్వనాథన్, ఎస్.రాజేశ్వరరావు, టి.వి.రాజు, టి.చలపతి రావు, చక్రవర్తి, ఇళయరాజా…. ఎవరిశైలి వారిది.ఎంతమంది వచ్చిన ఈయన స్టైల్ వేరు.అందరు ఆయన పాట స్వర పరిచిన తర్వాత స్వరపరిచే వారట ఎందుకంటే అయన స్వరపరిచిన పాటలకు ఎలాంటి జీవం ఇస్తాడో అని పరోక్షంగా కూడా వేచిచూసేవారు.
50 సంవత్సరాలు సంగీత ప్రపంచంలో విఖ్యాతి గాంచడం 4 భాషలలో కలిపి650 చిత్రాలకు పైగా స్వరాలూ చేయడం అంత సులభం కాదు…ముత్యాలముగ్గు,సప్తపది, మనుషులు మారాలి, మూగ మనసులు, అంతస్తులు, దాగుడు మూతలు,సిరి సిరి మువ్వ, సిరివెన్నెల, శ్రుతిలయలు, బడి పంతులు,శ్రీనివాస కళ్యాణం, జానకి రాముడు, అల్లుడుగారు, శంకరాభరణం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలే
తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశాడు. కాని ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి “భాష” అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకడు . కవి పాట రాశాక దానికి స్వరాలను అద్దేవాడు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించాడు .పాటలోని సాహిత్యాన్ని అధిగమించకుండా స్వరాలను అల్లేవాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తి కూడా మహాదేవనే.
‘శంకరాభరణం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి శాస్త్రియ సంగీతానికి ఈచిత్రంలో పెద్ద పీట వేసాడు. కె.విశ్వనాథ్ తీసిన ఈ సినిమా ఓ సంగీత విద్వాంసుడి జర్నీ. అంటే చిత్రానికి సంగీతమే ప్రాణం. ప్రతి పాటనీ ఓ ఆణిముత్యంగా మలిచాడు మహదేవన్. అందుకే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఎస్పీబీకి, వాణీ జయరామ్‌కి కూడా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టాయి.ఈ సినిమాకి నేను పాటలు పాడలేను అని బాల సుబ్రహ్మణ్యం అంటే ఆయనకు ప్రత్యేకంగా ఎలా పాడాలో నేర్పించి ఇందులో పాడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.ఈ సినిమా లో జేవీ సోమయాజులు సంగీత విద్వాంసుడిగా నటించి మెప్పించాడు.
2 జాతీయ అవార్డులు, 3 నందులు,ఫిలింఫేర్ అవార్డులు…ఎన్ని అందుకున్నా…ప్రజల హృదయాల్లో ‘మామ’ గా నిలిచిపోయిన కె .వి మహదేవన్ నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ సంగీతాన్ని ఉర్రుతలూగించి జూన్ 21న కన్నుమూశాడు.