Kushboo Sundar: మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
Kushboo Sundar Reveals She Was Sexually Abused By Her Father: సీనియర్ నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గానే జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా కూడా నియమితురాలయ్యింది. తెలుగు, తమిళ్ భాషల్లో మంచి మంచి పాత్రలు చేస్తున్న ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ తానూ కూడా చిన్నతనంలో లైంగిక వేధింపుల బారిన పడ్డానని, అందులోనూ తన తండ్రే లైంగికంగా వేధించినట్లు చెప్పుకొచ్చింది. 8 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
“చిన్న పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతుంది. అది వారి లైఫ్‌లో ఓ మచ్చగా మిగులుతుంది. నా తల్లి అయితే అత్యంత భయంకరమైన వివాహ జీవితాన్ని అనుభవించింది. పెళ్లి అయినప్పటి నుంచి నా తండ్రి తల్లిని దారుణంగా కొట్టేవాడు. మమ్మల్ని కూడా కొట్టేవాడు. 8 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను. 15 ఏళ్లు వచ్చాకా నేను ఆయనను ఎదిరించాను. నా 16 ఏళ్ల వయసులో మా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.. ఆ టైంలో మా కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నాం. ఈ విషయం మా అమ్మకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా తను నమ్మదు” అంటూ వాపోయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.