Kriti sanon: మా ఇద్దరిమధ్య ప్రేమ పుట్టించింది ఆయనే..కృతి సనన్
Kriti sanon: టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ ప్రభాస్ తీరిక లేని సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్లో గడుపుతున్నాడు. నాలుగైదు సినిమాలలో నటిస్తూ తీరికలేని సమాయయాన్ని గడుపుతున్నాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసం ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నాడు. రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్,అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా మొదలైనప్పటినుడిని కృతి సనన్ ప్రభాస్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని గత వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారని..త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తల ఫై కృతి సనన్ స్పందించింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఈ రూమర్లు రావడానికి కారణం వరుణ్ ధావన్ అని తెలిపింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వరుణ్ ధావన్ కి బోర్ కొట్టిందట. అప్పుడు వరుణ్.. ఒక రూమర్ ని పుట్టిస్తా అని తనతో అన్నాడట. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు అనే రూమర్ ని పుట్టిస్తా అని అనడంతో దానికి సరే అని అన్నదట కృతి సనన్. అయితే ఈ రూమర్ లోకి ప్రభాస్ ని లాగుతాడని తాను అస్సలు ఊహించలేదని ఆమె వెల్లడించింది. ఈ విషయం ప్రభాస్ కి కాల్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పాలనుకున్నానని, ప్రభాస్ కి కాల్ చేస్తే.. ఎందుకు వరుణ్ అన్నాడు అంటూ అడిగారట. అప్పుడు కృతి సనన్ తనకు తెలియదని చెప్పింది. దీంతో ఈ గుసగుసలు తెర పడ్డట్టే. ఇక వీరి కలయికలో వస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది జూన్ 16న విడుదల కాబోతుంది.