Krithi Shetty: ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల
Krithi Shetty’s Stylish First Look From Macherla Niyojakavargam: ఉప్పెన సినిమాతో బేబమ్మ పాత్రలో నటించి యువత గుండెలను కొల్లగొట్టింది కృతిశెట్టి. ఈ సినిమా తర్వాత నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్గా నటించి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వం వహించిన ‘ది వారియర్’ సినిమాలో నటించింది కృతి. ఈ సినిమా ఇటీవలే రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక కృతి శెట్టి తాజాగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఎమ్ఎస్ రాజశేఖరరెడ్డి సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో హీరోయిన్గా కేథరిన్ నటిస్తుంది. ఆగస్టు 12వ తేదీన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ మద్యే విడుదలైన అంజలి రా రెడ్డి సాంగ్ అత్యధిక వ్యూస్ తో దూసుకెతుంది.
ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా నుంచి పలు అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.గాగుల్స్ పెట్టుకుని, కర్లీ జుట్టుతో కాఫీ కప్ పట్టుకున్న కృతి శెట్టి స్వాతి పాత్రలో కనిపించబోతుందని రివీల్ చేసారు.
పక్కా మాస్ పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని రాజప్పగా విలన్ రోల్ లో కనిపించనున్నాడు.ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Introducing our ‘Swathi' aka @IamKrithiShetty ❤️
One of the core persons from #MacherlaNiyojakavargam 🚩
Get Ready to fall in Love with her from August 12th😍#MNVFromAug12th pic.twitter.com/vexAUuWYOV
— nithiin (@actor_nithiin) July 17, 2022