ఆసక్తికరంగా ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్..
యంగ్ హీరో నాగ శౌర్య, షిర్లీ సేఠియా జంటగా నటిస్తున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
మొట్ట మొదటిసారి శౌర్య ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. టీజర్ చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. టీజర్ లో నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే సహోద్యోగులుగా కనిపిస్తున్నారు. హీరోయిన్ ని చూడగానే హీరోకు మనుసులో గంట మోగుతోంది. ఇక దాంతో ఆమెను ప్రేమలో పడేయడానికి హీరో చేసే పనులను వినోదాత్మకంగా చూపించారు. మధ్యలో ఆమె అపార్థం చేసుకొని విడిపోవడం లాంటివి చూపించి ఇంట్రెస్ట్ పెంచేశారు. ఇక మహతి సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రంతో నాగ శౌర్య హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.