Kiran Abbavaram: దర్శకుడు బాబీ చేతులమీదుగా ‘మీటర్’ టీజర్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా ‘మీటర్’తో వచ్చేందుకు రెడీ అయ్యాడు. రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన ‘మీటర్’ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ని స్టార్ దర్శకుడు బాబీ చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ టీజర్ ను చూస్తుంటే సినిమాలో కిరణ్ అబ్బవరం సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించబోతున్నాడు. బాధ్యతలేని పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. డ్యూటీ పై ఆసక్తి లేకుండా, డ్యూటీని చేయాలని లేకున్నా చేస్తున్నట్లు కనిపిస్తున్న హీరో చుట్టూ తిరిగే కథతో ‘మీటర్’ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది. కామెడీ, యాక్షన్‌ను మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా సినిమాగా ‘మీటర్’ను తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం డాషింగ్ అండ్ మాస్ లుక్ తో ఈ సినిమాద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. కిరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ని మాస్ ని మురిపిస్తున్నాయి. నా మీటర్లో నేను వెళ్తా నన్ను గెలకొద్దు నాకు అడ్డు రావద్దు అని కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా వుంది. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.