Kiran Abbavaram: ఏప్రిల్ 7వ తేదీన కిరణ్ అబ్బవరం ‘మీటర్’
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవల సమ్మతమే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఇండస్టీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
‘మీటర్’ మూవీలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ బ్యూటీ అతుల్యా రవి హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారుమేకర్స్. కిరణ్ అబ్బవరం లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టబోతున్నాడని ఇండస్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.