Naa Saami Ranga First Look:టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన కింగ్ నాగార్జున కొంత కాలంగా తన ఫామ్‌ని కోల్పోతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వరుస ట్రెండ్ సెట్టర్లని అందించిన నాగ్ ఇప్పడు ఆ ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు.
Naa Saami Ranga First Look:టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన కింగ్ నాగార్జున కొంత కాలంగా తన ఫామ్‌ని కోల్పోతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వరుస ట్రెండ్ సెట్టర్లని అందించిన నాగ్ ఇప్పడు ఆ ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. వరుసగా ఫ్లాపులని సొంతం చేసుకుంటూ అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తున్నారు. `ఘోస్ట్` మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న నాగార్జున మళ్లీ పర్ ఫెక్ట్ మూవీతో రాబోతున్నారు.
ఈ సారి మరో కొత్త దర్శకుడిని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని మంగళవారం విడుదల చేశారు. నాగ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `నా సామిరంగ`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కింగ్ నాగ్ మరో సారి మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ మూవీ ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, నాగార్జున ఫస్ట్ లుక్ అదిరింది. `అన్నా లోపల యాభై ఆరు మంది రౌడీలని పోగేశాను.. ఈ పండక్కి పనైపోవాలి…ఆళ్లు మామూలోళ్లు కాదన్నా పులులు..అన్నా ఆడి చేయి..కాలు..ఏకంగా తలతీసేయమంటావా?… ఎవడన్నా ఆడూ… కింగ్… లోపలున్నవీ పులులు కాదురా… మేకలూ… అంటూ వినిపించే డైలాగ్‌లు.. లుంగీ ఎత్తి..రెడ్ కలర్ షర్ట్ ధరించి..నోట్లో బీడీ వెలిగిస్తూ ఎంట్రీ ఇచ్చిన నాగ్..ఈ సారి పండక్కి నా సామిరంగ` అంటూ చెబుతున్న డైలాగ్ అదిరిపోయింది.
కింగ్ నాగార్జున చాలా రోజుల తరువాత ఊర మాస్ క్యారెక్టర్లో నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాని 2024 సంక్రాంతికి తీసుకొస్తున్నామని, కింగ్ మాస్ జాతర సంక్రాంతికి జోరుగా ఉండబోతోందని టైటిల్ గ్లింప్స్‌తో మేకర్స్ రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి భారీ స్థాయిలో పోటీ ఉండనుందని తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి చాలా ఏళ్ల తరువాత కింగ్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నాగార్జున మాస్ అవతార్‌లో నటిస్తున్న ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, డైలాగ్స్ అందిస్తున్నారు.