విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘కిక్’ శ్యామ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ చిత్రం తరువాత ‘దళపతి 66’ లో నటిస్తున్న విషయం విదితమే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న ఈ చిత్రంలో మరో టాలెంటెడ్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కిక్, రేసు గుర్రం చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని శ్యామ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తాను సినిమాలో నటిస్తున్నానని, విజయ్ తో సినిమా కోసం చాలారోజుల నుంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలో శ్యామ్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడో చూడాలి.