Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఖుష్బూ నియామకం
Khushbu Sundar nominated as member of NCW
తమిళ నాడు బీజేపీ నేత ఖుష్బూకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించింది. బీజేపీ అధికార ప్రతినిధిగా, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆమె ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీ నేతృత్వంలో ఎదుగుతున్న నారీశక్తి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ట్వీట్ చేశారు.
మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కారణంగానే ఆమెకు ఈ పదవి లభించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు. ఖుష్బూకు అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులతో పాటు ఆమె అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
సినిమా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ఆ తర్వాత నిర్మాతగా మారారు. టీవీ కార్యక్రమాలు రూపొందించారు. తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటి డీఎంకే పార్టీలో చేరారు. అక్కడ కొంత కాలం పాటు ఉన్నారు. పార్టీ నేతలతో పొసగని ఆమె ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కరువయింది. దీంతో ఆమె బీజేపీలో చేరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. డీఎంకే అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు.
ఓటమి చెందినప్పటికీ ఆమె ప్రజా సమస్యలపై తనదైనశైలిలో పోరాటం చేస్తునే ఉన్నారు. ప్రముఖంగా మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారు. ఆమె చేసిన నిరంతర పోరాట ఫలితమే ఆమెకు ఈ పదవిని లభించేలా చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
I thank our H'ble PM @narendramodi ji and the government of India for entrusting me with such a huge responsibility. I shall strive hard to protect, preserve & nourish Nari Shakthi which is growing leaps & bounds under your leadership. Looking forward eagerly. #JaiHind@NCWIndia pic.twitter.com/Tm5GTJPEDe
— KhushbuSundar (@khushsundar) February 27, 2023
Thank you so much Mam. You have been a great at support 🙏🏻🙏🏻 https://t.co/lzF7szIgbs
— KhushbuSundar (@khushsundar) February 27, 2023
My Hearty Congratulations
to @BJP4India National Executive Committee Member Smt @khushsundar avl for being nominated as a Member of the National Commission for Women…❤️💐☺️#Khushbu #KhushbuSundar @annamalai_k @DuraiswamyVpd @KaruNagarajan @narayanantbjp @VinojBJP pic.twitter.com/1RV0ugRser— Rajini Prasanth (@Prasanth__BJP) February 27, 2023
Hearty Congrats to @BJP4India National Executive Committee Member Smt.@khushsundar Avl for being nominated as a member of the #NationalCommissionforWomen (NCW).#KhushbuSundar #NationalExecutiveCommitteeMember @narendramodi @AmitShah @JPNadda @annamalai_k @BJP4TamilNadu pic.twitter.com/e59QHIHLsg
— S Saravana Kumaran Ex IRS; Former Jt commissioner (@sskumarirs) February 27, 2023
Congrats to @khushsundar the @BJP4India Spokesperson and #NationalExecutiveCommitteeMember for getting nominated as a member of the National Commission for Women (NCW). She has been in the forefront for fighting for women’s rights. 💐👏🏼#KhushbuSundar pic.twitter.com/LvgT7y0No0
— Sreedhar Pillai (@sri50) February 27, 2023
Congratulations @khushsundar 💐💐 BJP Spokesperson and #NationalExecutiveCommitteeMember #KhushbuSundar gets nominated as a member of the National Commission for Women (NCW) @Riaztheboss1@V4umedia_ pic.twitter.com/rRNXgLA7W0
— sridevi sreedhar (@sridevisreedhar) February 27, 2023
..