KGF Chapter 2:కేజీఎఫ్ చాప్టర్ 2 కోజింగ్ కలెక్షన్ ఎంత ?
Kgf2 Closing Collections:యష్ హీరోగా కేజీఎఫ్ చాప్టర్1 సినిమాను 2018లో కన్నడ భాషలో తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమాను డబ్ చేసి ఓకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేశాడు. విడుదల చేసిన అన్ని భాషల్లో కలెక్షన్ల మోత మోగించింది.యష్ ను వన్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ గా మలిచింది.
కేజీఎఫ్ చాప్టర్1 రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు మార్మోగాయి . యష్ యాక్టింగ్‌కు , ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌కు రికార్డుల మోత మోగింది. 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి కన్నడ చిత్రంగా. కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డు సాధించింది. మిగిలిన భాషల్లో కూడా కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డ్స్ క్రియేట్ చేసింది.
కేజీఎఫ్2 ను దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌ను బలంగా తీర్చిదిద్దాడు . ఓ తల్లి లక్ష్యం గురించి చెప్పిన కథను డైరెక్టర్ చాలా గొప్పగా తెరకెక్కించాడు.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ కేజీఎప్ చాఫ్టర్స్ ను తెరకెక్కించాడు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో యష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ బడా స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రలో నటించారు సంజయ్ అధీర పాత్రకు కరెక్టుగా సెట్ అయ్యాడు. అంతే కాక ఈ సినిమాలో యష్ కు కరెక్ట్ విలన్ దొరికాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
చాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది రిలీజ్ రోజు నుండే కలెక్షన్లు రోజు రోజుకు పెరిగి పోయాయి. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. తక్కువ సమయంలోనే వేయి కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన బాహుబలి2 కలెక్షన్స్ 2000 కోట్లతో మొదటి సినిమా కాగా రెండో సినిమాగా కేజీఎఫ్ చాప్టర్2 రికార్డు సాధించింది. ఈ సినిమా రూ.1201 కోట్లను వసూళ్లు చేసింది. కన్నడ సినీ చరిత్రలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన మొదటి సినిమా కావడం అలాగే భారీ వసూళ్లను కొల్లగొట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. 50 రోజులు దాటినా కూడా కన్నడలో ఈ చిత్రం ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుండడం విశేషం.