Keerthy Suresh: హోంబలే సంస్థ లో ఛాన్స్ కొట్టేసిన.. కీర్తి సురేష్
Keerthy Suresh హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ కీర్తిసురేశ్. ఈ నటి ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘దసరా’, మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తుంది. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరో రెండు తమిళ సినిమాలు. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించింది
‘కేజీఎఫ్’ సిరీస్ లను అలాగే సూపర్ హిట్ సౌత్ సినిమా స్టామినా ని చాటిన ‘కాంతర’ మూవీని తెరకెకెక్కించిన సంస్థలో కీర్తి నటించబోతుంది. ప్రముఖ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నెక్స్ట్ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు ‘రఘు తథా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
𝐁𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐭𝐡𝐞 𝐑𝐞𝐯𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐚𝐭 𝐡𝐨𝐦𝐞 : தயாராகுங்கள்!#Raghuthatha @hombalefilms @KeerthyOfficial #MSBhaskar @sumank @VKiragandur @yaminiyag @RSeanRoldan @editorsuresh @tejlabani @HombaleGroup @RaghuthathaFilm pic.twitter.com/54TXBF89Pr
— Hombale Films (@hombalefilms) December 4, 2022