Karthikeya2: ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు ‘కార్తికేయ 2’
Karthikeya 2 to be out on 12th August: నిఖిల్ మొదటి నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.
నిఖిల్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమాను పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చారు. మొదటగా జులై 22న ఖరారు చేసింది యూనిట్. కానీ రిలీజ్ వాయిదా పడింది. ఎందుకంటే ఇదే రోజు నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో నిఖిల్ వెనకడుగు వేసాడు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక అదే రోజున నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా విడుదలవుతుంది. ‘ఈ కార్తికేయ 2’ రిలీజ్ డేట్ తో కూడిన ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.