సౌత్ మేకర్స్‌కి గేట్ వే ఆఫ్ బాలీవుడ్‌గా మారిన బడా ప్రొడ్యూసర్
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సినిమాలు డైరెక్ట్ చెయ్యడం తగ్గించి చాలా ఏళ్లు అయ్యింది. అయితే సినిమా డైరెక్షన్‌కి దూరంగా ఉన్నా, మార్కెటింగ్‌లో మాత్రం ఎక్స్‌పర్ట్ అని చెప్తుంటారు. ఈ మార్కెటింగ్ టెక్నాలజీ కోసమే సౌత్ మేకర్స్ అంతా కరణ్‌ని కలుస్తున్నారు. ప్రస్తుతం కరణ్ జోహార్ సౌత్ మేకర్స్‌కి గేట్ వే ఆఫ్ బాలీవుడ్‌గా మారుతున్నాడు. సౌత్‌లో పాన్ ఇండియన్ సినిమాలన్నిటికి బిగ్ సపోర్ట్ ఇస్తున్నాడు.
‘బాహుబలి, ఆర్ ఆర్ ఆర్’ నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు ‘కెజిఎఫ్-2’ వరకు బాలీవుడ్ మార్కెట్‌ని పెంచడానికి మైక్ అందుకుంటున్నాడు. కరణ్ జోహార్ ‘బాహుబలి’ హిందీ వెర్షన్‌ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక బాహుబలి1,2 కరణ్‌కి భారీగా లాభాలు తీసుకొచ్చాయి. దీంతో సౌత్ సినిమాలంటే కరణ్‌కి బోల్డంత అభిమానం మొదలైంది. ఈ అభిమానంతోనే ముంబాయి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హోస్టింగ్ చేశాడు.ఇక నిన్నటికి నిన్న కెజిఎఫ్ ట్రైలర్ లాంచ్ లోనూ తన వాక్చాతుర్యాన్ని చూపించాడు. దీంతో కరణ్‌ని సౌత్‌సినిమాలకి గేట్ వే ఆఫ్ బాలీవుడ్ అని పిలుస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.