Kantara: ఈ మధ్య కన్నడ సినిమాలు తెలుగు సినిమాలతో పాటు దూసుకెళ్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో కాంతార చిత్రానికి ఇండియా వైడ్‌గా విపరీతమైన ఆదరణ వస్తుంది. ఎలాంటి అంచనాల్లేకుండా చిన్న సినిమాగా విడుదయింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. రిషబ్‌శెట్టి నటనకు, దర్శకత్వానికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో 50కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రెంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తుందంటే విశేషం అనే చెప్పాలి. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఇండియా వైడ్‌గా ఈ చిత్రం రూ.290కోట్ల కలెక్షన్స్ సాధించింది.