Rishab Shetty: కాంతారా హీరో రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు
Kantara Hero Rishab Shetty meets Karnataka CM Basavaraj Bommai
కన్నడ హీరో రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో రిషబ్ శెట్టి బీజేపీ అగ్రనాయకులను కలవడం ఈ ప్రచారానికి ఊతం ఇస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రిషబ్ శెట్టి, తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో భేటీ అయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు ఊపందుకున్నాయి.
సమస్యల పరిష్కారానికి కృషి
కాంతారా సినిమా ద్వారా రిషబ్ శెట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ షూటింగ్ కూడా జరుగుతోంది. కాంతారా సినిమా ఆలోచన మొదలైన దగ్గర నుంచి అటవీ ప్రాంతంపై రిషబ్ శెట్టికి అవగాహన పెరిగింది. అక్కడి సమస్యలపై అవగాహన పెరిగింది. వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అవగతం అయ్యాయి.
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అటవీ ప్రాంతాల్లో పని చేసే ప్రభుత్వ సిబ్బంది మొత్తం అన్ని వర్గాల వారు తమ సమస్యలను రిషబ్ శెట్టికి తెలియజేశారు. వారితో చాలా కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్న రిషబ్ వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు. సీఎంకు బసరవాజ్ బొమ్మైకు ఓ పిటిషన్ అందించాడు. 20 సమస్యలను ఆ పిటిషన్లో ప్రస్తావించాడు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు.
ಕಾಂತಾರ ಚಿತ್ರದ ನಂತರದ ದಿನಗಳಲ್ಲಿ ಕಾಡು ಸುತ್ತಿ,ಅಡವಿ ಅಂಚಿನ ಜನರ ಜತೆ ಮಾತಾಡಿ, ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಸಿಬ್ಬಂದಿಗಳ ಜತೆ ಚರ್ಚಿಸಿ ಕಲೆಹಾಕಿದ ಅಂಶಗಳನ್ನು ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಮುಂದಿಟ್ಟಾಗ ಅವರು ತಕ್ಷಣವೇ ಪರಿಹರಿಸುವುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಸಮಸ್ಯೆಗೆ ಸ್ಪಂದಿಸಿದ ಶ್ರೀ @BSBommai ಯವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು.@CMofKarnataka @aranya_kfd pic.twitter.com/VRL9YDDZcg
— Rishab Shetty (@shetty_rishab) March 8, 2023
Rishab Shetty