KamalHasan: రజినీకాంత్ దర్శకుడితో కమల్ హాసన్ సినిమా ?
Kamal Haasan confirms his next with Pa. Ranjith: ‘విక్రమ్’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది.కమల్ హాసన్ కెరీర్ లో అత్యంత బారి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
నాలుగేళ్ల విరామం తర్వాత తమ అభిమాన హీరో ను వెండితెరపై చూసి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘విక్రమ్’ సినిమాను కమల్ ఫ్యాన్సే కాకుండా సినీ ప్రేమికులు కూడా ఎంజాయ్ చేశారు. రిలీజైన అన్ని భాషల్లో విక్రమ్ సినిమా రికార్డులు సృష్టించింది. తమిళంలో ‘బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.450 కోట్లు కలెక్ట్ చేసింది విక్రమ్ .
ఈ చిత్రం తర్వాత కమల్ హాసన్ .. టేక్ ఆఫ్, సీ యూ సూన్, వంటి సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మహేష్ నారాయణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాతోపాటు ఎప్పుడో మొదలైన ‘ఇండియన్2’ సినిమాను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట కమల్. ఇప్పటికే ఇండియన్2 సినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తయ్యింది. మిగతా భాగాన్ని కూడా తొందర్లోనే పూర్తి చేయనున్నాడు.ఈ సినిమాకి దర్శకుడు శంకర్.ప్రస్తుతం శంకర్ రాంచరణ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం పూర్తయితే గాని ‘ఇండియన్2’ సెట్ లోకి వెళ్లేలా లేడు.
అయితే ఇండియన్2 మొదలయ్యే లోపు ఈ గ్యాప్ లో కమల్ మరో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. రజినీకాంత్‌తో కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్. ‘సార్పట్ట పరంపర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం రంజిత్ విక్రమ్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ మద్యే కమల్ ను కలిసి ఓ స్టోరీ వినిపించాడట అది కమల్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.