Kalyan Ram: ‘బింబి సారా’ నుంచి రెండో ట్రైలర్ విడుదల
Kalyan Ram Bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ కు ఇప్పుడొక హిట్ కావాలి.ఎందుకంటే తాను తాజాగా నటించే చిత్రం కమర్షియల్ యాక్షన్ సినిమా కాదు ఒక సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి తప్పకుండ హిట్ పడాల్సిందే. ఈ చిత్రంలో తన నట విశ్వరూపం చూపించడానికి వచ్చేస్తున్నాడు. ‘బింబిసార’ నుంచి వచ్చిన కొత్త ట్రైలర్ కల్యాణ్‌రామ్‌లోని రౌద్ర రూపాన్ని కళ్లకు కట్టెల చూపించారు మేకర్స్.
ఈ మూవీ ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. తాజాగా కొత్త ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్ నటనని ఎన్నడూ చూడని విదంగా ఉంది. అతనిలోని నటవిశ్వరూపాన్ని ఈ చిత్రంలో చుపించాడు.
కొత్త ట్రైలర్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో రాక్షసరాజు బింబిసారుని పాత్రతోపాటు కలియుగ కాలంలోని మరో పాత్రలోనూ కల్యాణ్‌రామ్ కనిపిస్తున్నాడు. ఈ కొత్త ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు.ఈ తాజా ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. హద్దులను చెరిపి వేస్తూ మనరాజ్యాలు సరిహద్దులు ఆపై రాజ్యాలకు విస్తరించాయి ‘శరణు కోరితే ప్రాణభిక్ష.. ఎదిరిస్తే మరణం’ అంటూ కళ్యాణ్ రామ్ డైలాగ్స్ తో మొదలైన ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది.