Kalpika Ganesh: ఆసుపత్రిలో చేరిన తెలుగు నటి.. అసలు ఏమైందంటే?
Kalpika Ganesh Shares a Photo from Hospital Bed: నటి కల్పికా గణేష్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతోంది. 2009లో వచ్చిన ప్రయాణం సినిమాతో నటిగా పరిచయమైన ఆమె ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె సమంత యశోద సినిమాలో నటించి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఇంతకాలం సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కల్పిక ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సమంతలాగే తాను కూడా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్నాడన్న విషయాన్ని బయటపెట్టింది. ఇకతాజాగా కల్పిక ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. లుంబార్ రాడిక్యులోపతి విజయవంతమైందని పేర్కొంటూ పోస్ట్ చేసింది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలనిస్తుంది అనేది చూడాలి అని రాసుకొచ్చింది. కల్పిక రాడిక్యులర్ పెయిన్‌కు ఈ చికిత్స చేయించుకుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నెముక ద్వారా నొప్పి తొడలు, పాదాల వరకు వస్తుంది. దీనివల్ల మనిషి ఎక్కువసేపు నిల్చో లేకపోవడంతో, బలహీనంగా మారుతారు. ఇక కల్పికా త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.