తల్లి అయ్యాక కాజల్ ఎమోషనల్ పోస్ట్.. వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రెండు రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ బిడ్డకు నీల్ కిచ్లూ అని నామకరణం చేసేశారు. ఇక ప్రస్తుతం కాజల్ మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. తల్లిగా తనకు బాధ్యతలను నిర్వరించాలని, ఇదంతా అంత ఈజీ గా జరగలేదని చెప్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “బేబీ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నీల్ పుట్టిన క్షణంను నేను ఎప్పటికి మర్చిపోలేను.. నా బిడ్డను ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి నా వద్దకు తీసుకొచ్చినప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించలేను. ఆ క్షణాల్లో నేను ఎదుర్కొన్న అనుభూతి నాకు అద్భుతమైన తల్లి ప్రేమను అర్థమయ్యేలా చేసింది. బిడ్డ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తు చేసింది. అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదు. మూడు నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంప్స్, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను.
కానీ, ఎప్పుడైతే నా చిన్నారిని నేను ఎత్తుకున్నానో ఆ బాధ అంతా మటుమాయం అయిపోయింది. మేము ఇద్దరం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, ముద్దుల్లో ముంచెత్తుతూ ఏకాంతంగా ఉండిపోయాం. ప్రసవానంతరం ఇదంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చేమోగానీ అందంగా మాత్రం ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు తల్లి బంధం అలాంటింది.. మీరిద్దరు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు.